Site icon TeluguMirchi.com

24న వేటాడు వెంటాడు

Vetadu-Ventadu-Movie- on jan 24విశాల్ హీరోగా 5 కలర్స్ మల్టీమీడియా పతాకంపై నిర్మాత శ్రీనివాస్ దామెర ప్రేక్షకులకు అందిస్తున్న ద్విభాషా చిత్రం ‘వేటాడు-వెంటాడు’ అన్ని కార్యక్రమాల్ని పూర్తిచేసుకొని ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు తిరుఎక్కడా కాంప్రమైజ్ అవకుండా చైనా, మలేసియా, బ్యాంకాక్ మొదలైన ప్రదేశాల్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. దీనికి సంబంధించిన ఆడియో వేడుక ఇటీవలే జరిగింది. ఈ చిత్రం కోసం అనంత శ్రీరాం, రామజోగయ్య శాస్త్రి, కందికొండ వనమాలిలు వ్రాసిన గీతాలకు సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్ దామెర మాట్లాడుతూ “ఇటీవలే మేము విడుదల చేసిన ఆడియోకి మంచి స్పందన లభించింది. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం హీరోగా విశాల్ కి చాలా మంచిపేరు తెచ్చిపెడుతుంది. ఇందులో విశాల్ కి జతగా అందాల నటి త్రిష నటించింది. అన్ని పనుల్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్నిఈ నెల 24న విడుదల చేసేందుకు సర్వసన్నాహాలు చేస్తున్నాము” అన్నారు. విశాల్, త్రిష, మనోజ్ బాజ్ పాయ్, సునయన తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ యువన్ శంకర్ రాజా అందించారు.

Exit mobile version