Srikakulam Sherlock Holmes : క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా వెన్నెల కిషోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’


ప్రముఖ హాస్య నటుడు వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో రైటర్ మోహన్ దర్శకత్వంలో ఓ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ రూపొందుతోంది. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై వెన్నపూస రమణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. నిన్న(సోమవారం) జరిగిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ..ఈ సినిమా టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది. 24 మంది డైరెక్టర్స్ తో ఒక టైటిల్ ని లాంచ్ చేయడం చాలా అరుదు. సినిమాలో సరికొత్త వైబ్ కనిపిస్తోంది. మంచి వినోదం వుటుందని నమ్మకం కలుగుతోంది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.

అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. ఈ సినిమా ఒక పజిల్ లాంటిది. ఏం జరుగుతుందనే క్యురియాసిటీ వుంటుంది. ఆ పజిల్ ని డైరెక్టర్ మోహన్ గారు చాలా అద్భుతంగా ఫిల్ చేశారు. దర్శకుడు మోహన్ మాట్లాడుతూ.. షెర్లాక్ హోమ్స్ లో మూడు పాత్రలు వున్నాయి. షెర్ అంటే శర్మిలమ్మ (అమ్మ).. లోక్ అంటే లోకనాధం(నాన్న) హోం అంటే ఓం ప్రకాష్. రూరల్, 91 రెట్రో బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా చేశాం. ఫన్నీగా థ్రిల్లింగా ఉంటుందన్నారు.

ఇక ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా.. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో అనిష్ కురివిల్లా, రవితేజ మహాదాస్యం, షియా గౌతం, నాగ మహేష్, భద్రం, కాలకేయ ప్రభాకర్, ప్రభావతి, మురళిధర్ గౌడ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.