Site icon TeluguMirchi.com

స్పీడ్ పెంచిన మామల్లుడు..

మామల్లుడు వెంకీ..చైతు స్పీడ్ పెంచారు. ప్రేమమ్ సినిమాలో కాసేపు స్క్రీన్ పంచుకున్న వీరిద్దరూ..ఇప్పుడు సినిమా మొత్తం కనిపించబోతున్నారు. బాబీ డైరెక్షన్లో వెంకీమామ సినిమా చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ కాశ్మీర్ లో జరుపుకొని హైదరాబాద్ కు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ వైజాగ్ లో జరుపుకోబోతుంది. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు.

వెంకటేష్.. నాగచైతన్యతో పాటు యూనిట్ అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటుంది. వైజాగ్ షెడ్యూల్ తో దాదాపు 75 శాతం వరకు షూటింగ్ పూర్తివుతుందట. మిగతా మైనర్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారట. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి.. సెప్టెంబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ చూస్తుంది.

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ ఫై తెరకెక్కుతున్న ఈ మూవీ లో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా..చైతు కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ మ్యూజిక్.

Exit mobile version