బుల్లెట్ రాజా కేక పుట్టిస్తున్నాడు..

వెంకటేష్ – నాగ చైతన్య హీరోలుగా బాబీ డైరెక్షన్లో వెంకీ మామ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చివరి దశకు షూటింగ్ చేరుకోవడంతో సినిమాకు సంబందించిన ఒక్కో న్యూస్ ..ఫొటోస్ బయటకు వాస్తు అభిమానులను ఆకట్టుకుంటూ…సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నాయి.

తాజాగా వెంకీ కి సంబందించిన ఓ లుక్ బయటకు వచ్చి సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో లో వెంకీ ఆర్మీ గ్రీన్ బులెట్ పై కూర్చొని మీసం మెలితిప్పుతున్నట్లు కనిపించాడు. చుట్టూ పొలాల మధ్య వెంకటేష్ ని చూస్తుంటే కోనసీమ బులెట్ బాబులా వెంకీ ఈ చిత్రంలో కేక పుట్టిస్తాడని అనిపిస్తుంది.

రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తుండగా ..సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. అక్టోబర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.