‘వెంకీ మామ’ షూటింగ్ అప్డేట్..

ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య , వెంకటేష్ కలిసి ఓ సన్నివేశం లో కనిపించి అభిమానులను సంతోష పెట్టారు. తాజాగా ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు. జై లవకుశ మూవీ తో హిట్ అందుకున్న డైరెక్టర్ బాబీ, వీరిద్దరి కలయికలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం అతిరధుల సమక్షంలో ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ జరుగగా, నవంబర్ 12వ తేదీ నుండి రెగ్యూలర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

ఇక ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. కోన వెంకట్, సురేష్ బాబు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు . ఈ మూవీ లో వెంకీ కి జోడిగా “కాలా” ఫేమ్ హ్యూమా ఖురేషి జోడి కడుతుండగా, చైతూకి జోడీగా రకుల్ ప్రీత్ నటించనున్నారు.