Site icon TeluguMirchi.com

మేకింగ్ : వెంకీమామ అదుర్స్ ..

వెంకటేష్ , నాగ చైతన్య హీరోలుగా పాయల్ రాజ్ పుత్ , రాశి ఖన్నా లు హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం వెంకీమామ. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక తాజాగా బాబీ పుట్టినరోజు సందర్భంగా ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో మామా అల్లుళ్లిద్దరు రెచ్చిపోయారు. చూస్తుంటే వీరిద్దరు ఏదో మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఇందులో వెంకటేష్ రైతు పాత్రలో కనిపిస్తుండగా.. చైతూ ఆర్మీ జవాన్ పాత్రలో నటించనున్నాడు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే నిజజీవితంలో మేనమామ, మేనల్లుడైన వెంకటేష్, చైతూ.. ఈ మూవీలో మామఅల్లుళ్లుగా కనిపించబోతున్నారు. దీంతో ఈ కాంబోపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.

Exit mobile version