Site icon TeluguMirchi.com

జాతర లో భారీ ఫైట్..

ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకటేష్..మజిలీ తో హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన నాగ చైతన్య ..ఇద్దరు కలిసి చేస్తున్న చిత్రం వెంకీ మామ. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జాతరలో ఓ భారీ ఫైట్ సీన్ ను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తున్నారు. ఈ భారీ ఫైట్ కోసం ఐదు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్స్ సమక్షంలో షూట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజ్ పుత్ నటిస్తుంటే.. చైతూకి జంటగా రాశి ఖన్నా నటిస్తుండటం విశేషం. మొదటిసారి మామ అల్లుళ్లు కలిసి నటిస్తుండడం..ఇద్దరు సక్సెస్ ట్రాక్ లో ఉండడం..జై లవకుశ హిట్ తర్వాత బాబీ చేస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మరి వెంకీ మామ ఆ అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

Exit mobile version