Site icon TeluguMirchi.com

వెంకీమామ బడ్జెట్ అంతనా..?

వెంకటేష్ , నాగ చైతన్య హీరోలుగా పాయల్ రాజ్ పుత్ , రాశి ఖన్నా లు హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం వెంకీమామ. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కాగా ఈ సినిమా బడ్జెట్ ప్రస్తుతం ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అక్టోబర్ లో విడుదల చేసే ప్లాన్ తో సురేష్ బాబు బిజినెస్ డీల్స్ మొదలు పెట్టగా. దీనికి సుమారుగా 50 కోట్ల దాకా బడ్జెట్ అయ్యిందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి సురేష్ బాబు ఎంత తమ్ముడైన అల్లుడైనా చాలా క్యాలికులేటెడ్ గా రిస్క్ తగ్గించుకుని తన నిర్మాణంలో సినిమాలను ప్లాన్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాకు మాత్రం 50 కోట్లు పెట్టడం అనేది హాట్ టాపిక్ అయ్యింది. దీనికి కారణం వెంకటేష్ , చైతు లు ఫుల్ సక్సెస్ జోరు లో ఉండడమే అని..అదికాక మార్కెట్ కూడా పెరిగిపోవడంతో ఆ రేంజ్ బడ్జెట్ పెట్టి ఉంటాడు కావొచ్చని అంటున్నారు. మరి ఈ బడ్జెట్ విషయం నిజమా కదా అనేది తెలియాలి.

Exit mobile version