Site icon TeluguMirchi.com

వెంకీ మూకీ సినిమా?

venkateshప్రయోగాలంటే ఇష్టప‌డే క‌థానాయ‌కుడు వెంక‌టేష్‌. మ‌రోసారి ఆయ‌న విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ప్రస్తుతం ఆయ‌న బోల్‌ బ‌చ్చన్ రీమేక్‌ లో న‌టిస్తున్నారు. ఆ త‌ర‌వాత ఓ మూకీ చిత్రంలో న‌టిస్తార‌ని స‌మాచారం. పుష్పక‌విమానం త‌ర‌వాత ఆ జోన‌ర్‌ లో తెలుగులో సినిమా రాలేదు. ఆలోటు తీర్చడానికి వెంకీ స‌న్నాహాలు చేస్తున్నారు. పిల్లజ‌మిందార్ ద‌ర్శకుడు అశోక్‌.. వెంకీ కోసం ఓ క‌థ సిద్ధం చేశార‌ట‌. అది మూకీ సినిమా అట‌. వెంకీకీ బాగా న‌చ్చింద‌ట‌. సొంత బ్యాన‌ర్‌ లో ఈ చిత్రం తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version