Site icon TeluguMirchi.com

Gopichand : ‘విశ్వం’ నుంచి జర్నీ అఫ్ విశ్వం.. ‘వెంకీ’ సినిమా ట్రైన్ ఎపిసోడ్ రిపీట్..


మాచో స్టార్ గోపీచంద్, స్టైలిష్ డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘విశ్వం’. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి ‘ది జర్నీ ఆఫ్ విశ్వం’ అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ వీడియోలో వండర్ ఫుల్ విజువల్స్, డైనమిక్‌ అండ్ స్టైలిష్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సన్నివేశాలు వున్నాయి.

Also Read : నెం.1 ప్లేస్ లో ప్రభాస్ ‘రాజా సాబ్’ గ్లింప్స్


అంతేకాదు ఆడియన్స్ లో ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేస్తూ సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో తెలియజేసేలా అద్భుతంగా ఈ వీడియోని డిజైన్ చేశారు. అలాగే వెంకీ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ లాగా ఇందులో కూడా ట్రైన్ ఎపిసోడ్ చూపించారు. చూస్తుంటే ఈసారి శ్రీను వైట్ల మార్క్ హ్యుమర్, యాక్షన్‌, కామెడీ ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక గోపీచంద్ యాక్టింగ్, స్టైలిష్ ఇంటెన్స్ రెండిట్లో అదరగొడతారు. మొత్తంమీద ది జర్నీ ఆఫ్ విశ్వం అద్భుతమైన లోకేషన్స్, హై-ఆక్టేన్ యాక్షన్, హిలేరియస్ హ్యుమర్ తో ఆడియన్స్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

The Journey of Viswam | Gopichand | Sreenu Vaitla | TG Vishwa Prasad | People Media Factory

Exit mobile version