Site icon TeluguMirchi.com

వెంకీమామ షూటింగ్ అప్డేట్..

వెంకటేష్ , నాగ చైతన్య హీరోలుగా పాయల్ రాజ్ పుత్ , రాశి ఖన్నా లు హీరోయిన్లు గా తెరకెక్కుతున్న చిత్రం వెంకీమామ. జై లవకుశ ఫేమ్ బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుంది. కీలకమైన ఆర్మీ నేపధ్య సన్నివేశాలను అక్కడ షూటింగ్ చేస్తున్నారు. వెంకటేష్, నాగచైతన్య ఇతర తారాగణం ఈ షూటింగ్ లో పాల్గొన్నారు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ మూవీ జూన్ 13 తో కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంటుందట. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యూల్ మొదలు పెట్టి దానితో షూటింగ్ అంత పూర్తి చేస్తారని సమాచారం.ఫుల్లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13 వ తేదీన రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా పూర్తి కాగానే వెంకీ నేను లోకల్ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ పూర్తి చేశారట త్రినాధ్.

Exit mobile version