వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘వెంకీ మామ’. మామ అల్లుడు కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. జైలవకుశ చిత్రం తర్వాత దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు సహజంగానే భారీగా ఉండటం జరుగుతుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అయినా కూడా ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఏమీ ఇంకా రాలేదు. తాజాగా ఈ చిత్రం నుండి ఒక సర్ ప్రైజ్ రాబోతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
వెంకీ మామ నుండి రాబోతున్న సర్ప్రైజ్ ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు రాబోతున్న సర్ప్రైజ్ వీడియోనా లేదంటే ఫొటోనా లేదంటే విడుదలకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఇన్ని రోజులు ఎలాంటి విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. సినిమాను దసరా బరిలో దించే యోచనలో యూనిట్ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది.