వాల్మీకి ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్ ఎవరో తెలుసా ..?

హరీష్ శంకర్ డైరెక్షన్లో వరుణ్ తేజ్ – పూజా హగ్దే జంటగా తెరకెక్కుతున్న చిత్రం వాల్మీకి. రీసెంట్ గా రిలీజ్ అయినా ఈ చిత్ర ట్రైలర్ సినిమా ఫై అంచనాలు పెంచగా..ఇంకాస్త సినిమా క్రేజ్ తెచ్చేందుకు చిత్ర యూనిట్ భారీ ప్లాన్ చేస్తుంది. ప్రమోషన్లలో భాగంగా ఈ నెల 15న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా జరపబోతున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా వెంకటేష్ హాజరుకాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసారు. వరుణ్ తేజ్, వెంకటేష్ గతంలో ‘ఎఫ్ 2’ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

తమిళ సూపర్ హిట్ సినిమా ‘జిగర్తాండ’కు రీమేక్ గా ఈ నెల 20 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 14 రీల్స్ బ్యానర్ ఫై నిర్మితమైన ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.