Site icon TeluguMirchi.com

అక్టోబర్ 2 న పవన్ వెంకీల మూవీ

pavan venkiవిక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఓ మల్టీ స్టారర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘ఓ మై గాడ్’ కి రీమేక్ గా ఈ చిత్ర తెరకెక్కుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రానికి అప్పుడే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసారు. సురేష్ ప్రొడక్షన్స్ – నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై డి.సురేష్ బాబు – శరత్ మరర్ కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మే నెలలో దీని రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఏకదాటిగా షూటింగ్ జరుపుకొని అక్టోబర్ 2 కల్లా ఈ చిత్రం రెడీ అవుతుందని యూనిట్ చెబుతోంది.

Exit mobile version