Site icon TeluguMirchi.com

వెంకటేష్ ‘సైంధవ్’ రిలీజ్ డేట్ !


విక్టరీ వెంకటేష్ 75వ సినిమా ‘సైంధవ్’ టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం డిసెంబర్ 22, 2023న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది అని మేకర్స్ తాజాగా ప్రకటించడం జరిగింది. ఇక విడుదల తేదీని ప్రకటించేందుకు వెంకటేష్ గన్ పట్టుకుని కంటైనర్‌పై కూర్చున్న మాస్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇకపోతే బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఇక సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వెంకటేష్ యొక్క మొదటి పాన్ ఇండియన్ మూవీ.

Exit mobile version