Site icon TeluguMirchi.com

కాపీ క‌థ‌లో… వెంక‌టేష్ పాత్ర ఎంత‌?

raadha‘రాధా’ క‌థ కాపీ వ్యవ‌హారం చినికి చినికి గాలివాన‌గా మారే అవ‌కాశం ఉంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్‌. అస‌లు ఈ మొత్తం వ్యవ‌హారంలో వెంక‌టేష్ కీల‌క‌పాత్రధారి అని తెలుస్తోంది. నిజానికి ఈ క‌థ నాది.. అని రైట‌ర్స్ అసోసియేష‌న్‌ ని ఆశ్రయించిన సురేంద‌ర్ కృష్ణ – వెంకీని కూడా టార్గెట్ చేస్తున్నాడు. ఈ క‌థ ముందుగా వినిపించింది వెంక‌టేష్‌ కేన‌ట‌. యేడాది క్రిత‌మే వెంకీకి ”ఓ ఎమ్మెల్యే ప్రేమ క‌థ‌..” అంటూ ఓ క‌థ చెప్పాడు సురేంద‌ర్‌. ”క‌థ బాగుంది.. కీపిట‌ప్‌” అని చెప్పిన వెంక‌టేష్ ఆ త‌ర‌వాత మాట మార్చి ”చూద్దాం, చేద్దాం” అన్నార్ట‌. ఇప్పుడు అదే లైన్ మారుతికి చెప్పి – హోంమినిస్టర్ ప్రేమ‌క‌థ‌గా మార్చుకొన్నాడట‌. దాంతో ఈ కాపీ వ్యవ‌హారంలో వెంకీ పాత్ర ఎంత‌?? అని ఆలోచిస్తోంది ఫిల్మ్‌న‌గ‌ర్‌. కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారా.? లేదంటే ఏదైనా మ‌త‌ల‌బు న‌డుస్తుందా?? అనే విష‌యాలు విచార‌ణ‌లో గానీ తేల‌వు.

Exit mobile version