Site icon TeluguMirchi.com

‘బాబు’ .. ‘బొబ్బిలి రాజా’ ఈజ్ బ్యాక్

venkatesh
”టైగర్ వెజ్ తింటే వెటకారంగా చూశారు..ఇప్పుడు నాన్-వెజ్ లోకి దిగిందిరా ఇక నరకమేరా ఒకొక్కడికి..!!
ఇదీ ‘బాబు బంగారం’ వరస. వెంకటేష్ తాజా చిత్రం ‘బాబు బంగారం’ . మారుతి దర్శకుడు. ఈ సినిమా ఆడియో విడుదలైయింది. ఆడియోతో పాటు ట్రైలర్ కూడా బయటికివచ్చింది. ఈ ట్రైలర్ లోని డైలాగే ఇది.

ఇక ట్రైలర్ గురించి చెప్పకుంటే.. యాక్షన్+ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి రూపొందించిన చిత్రమిది. ఇందులో వెంకటేష్ పోలీసు. మామూలు పోలీసు కాదు. చాలా జాలి గల పోలీస్. అయితే అంతలోనే క్యారెక్టర్ మారిపోతుంది. అదే ఇక్కడ ‘బాబు బంగారం’ కాన్సెప్ట్. అలాగే ఈ సినిమాలో ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా వుంది. అదేంటో తెరపైనే చూడాలి. మ్యూజిక్ విషయానికి వస్తే గిబ్రాన్ మంచి స్కోర్ చేశాడు. ఫోటోగ్రఫీ కూడా రిచ్ గా వుంది. ఇక ట్రైలర్ చివర్లో .. ‘బొబ్బిలి రాజా’ ఈజ్ బ్యాక్ అంటాడు పృద్వీ. ‘బొబ్బిలి రాజా’ అంటే వెంకీ కెరీర్ లో అదిరిపోయిన బ్లాక్ బస్టర్. మరి, బాబు బంగారం రిజల్ట్ ఎలా వుటుందో..

Exit mobile version