ఈ పాట వీడియో టీజర్‌ను విడుదల చేయడం జరిగింది. 50 సెకన్ల సాంగ్ ప్రోమోను ఆవిష్కరించడం జరిగింది. కొందరు ఈ పాటపై ప్రశంసలు కురిపిస్తుంటే మరి కొందరు మాత్రం ఒక అద్బుతమైన సాంగ్‌ను నాశనం చేశారు కదరా అంటూ విమర్శలు చేస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఎక్కువగా రీమిక్స్ చేయకుండా 90 శాతం అలాగే ఉంది 10 శాతం మాత్రమే మార్చడం జరిగింది. రీమిక్స్ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అయ్యింది. దేవత చిత్రంలోని ఆ పాట చిత్రీకరించినట్లుగానే ఈ పాటను కూడా భారీగా బిందెలను పెట్టి చిత్రీకరించారు. మరి ఈ పాట చిత్రంకు ఎంత మేరకు ఉపయోగపడుతుందో చూడాలి.