Katha Keli : దెయ్యానికే క‌థ చెప్పాల్సి వ‌స్తే.. ?


చింతా గోపాలకృష్ణా రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో శ‌త‌మానం భ‌వ‌తి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై స‌తీశ్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కథా కేళి’. ఇందులో ఈషారెబ్బ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అలాగే పూజిత పొన్నాడ, అనన్య నాగళ్ల, నందిని రాయ్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. య‌శ్విన్‌, దినేశ్ తేజ్‌, అజ‌య్‌, బాలాదిత్య‌, నందిని, ఆయుషి, ప్రీతి, విరాట్‌ త‌దిత‌రులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఎస్.కె. బాలచంద్రన్ సంగీతం అందించారు. ఆదివారం జరిగిన టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ‘కథా కేళి’ మూవీ లోగోను అగ్ర నిర్మాత‌ దిల్ రాజు విడుద‌ల చేయగా, టీజ‌ర్‌ను స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ విడుద‌ల చేశారు.

ఈ సంద‌ర్భంగా అగ్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘కథా కేళి’ టీజ‌ర్ చూస్తుంటే స‌తీశ్ కొత్త ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు అనిపించింది. స‌తీశ్ స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌. కొత్త‌, పాత న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల క‌ల‌యిక‌లో స‌తీశ్ చేసిన ప్ర‌య‌త్నం పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ.. ‘శతమానం భవతి’ అనే టైటిల్ మా అందరికీ ఎంతో ఇంపార్టెంట్. చాలా సంవ‌త్స‌రాల త‌ర్వాత తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లి మ‌న అంద‌రినీ గ‌ర్వ‌ప‌డేలా చేసిన సినిమా శ‌త‌మానం భ‌వ‌తి. స‌తీశ్‌గారికి మ‌న‌స్ఫూర్తిగా నా కృత‌జ్ఞ‌త‌లు. నేను డైరెక్ట‌ర్ కాక ముందు నుంచి ఆయ‌న స‌క్సెస్‌ఫుల్ రైట‌ర్‌. అప్ప‌టి నుంచే మా జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. గబ్బ‌ర్ సింగ్ నుంచి డీజే, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ వంటి సినిమాల‌కు ప‌ని చేసిన స‌తీశ్ ఇవాళ శ‌త‌మానం భ‌వ‌తి అనే బ్యాన‌ర్‌ను పెట్ట‌టం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఇందులో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. కథాకేళి సినిమా టీజర్ చూస్తుంటే సినిమా మంచి పేరు, లాభాలను తెచ్చి పెడుతుందని భావిస్తున్నాను అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు స‌తీశ్ వేగేశ్న మాట్లాడుతూ.. “నేను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి పాతికేళ్లు అవుతుంది. ప్రియా ఓ ప్రియా చిత్రంలో నా పేరుని మొద‌టిసారి స్క్రీన్‌పై చూసుకున్నాను. ఆరోజు నుంచి ఈరోజు వ‌ర‌కు రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌గా నిల‌బ‌డ్డాను. ఈ బ్యాన‌ర్ పెట్టిన‌ప్పుడు ఎందుకు బ్యాన‌ర్ పెట్టావ‌ని చాలా మంది అడిగారు. ఓసారి ఈవీవీ సినిమా అనే బ్యాన‌ర్ ఎందుకు పెట్టార‌ని నేను ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌గారిని అడిగిన‌ప్పుడు మ‌న‌కు సినిమా త‌ప్ప మరేం రాదు. మ‌నం సినిమాలు మాత్ర‌మే తీయ‌గలం. మ‌నం ఫ్లాప్స్‌లో ఉన్న‌ప్పుడు మ‌న‌తో నిర్మాత‌లు సినిమాలు చేయ‌రు. ఒక‌వేళ నిర్మాత‌లు ఓకే అన్నాకూడా ఆర్టిస్టులు ముందుకు రారు. క‌ష్ట‌మైనా, న‌ష్ట‌మైనా మ‌నమే చేయాల‌ని అన్నారు. ఆయ‌న చెప్పిన మాట‌లతోనే ఇప్పుడు బ్యాన‌ర్ పెట్టాను. కోవిడ్ వ‌ల్ల నేను స్టార్ట్ చేసిన కోతి కొమ్మ‌చ్చి, శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాలు లేట్ అవుతున్నాయి. ఈ గ్యాప్‌లో ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేద్దామ‌ని చేసిన సినిమానే ఈ క‌థాకేళి. సాధార‌ణంగా దెయ్యం క‌థ‌ల‌ను అంద‌రూ చెప్పి ఉంటారు. కానీ దెయ్యానికే క‌థ చెప్పాల్సి వ‌స్తే.. అనేదే మా క‌థా కేళి సినిమా. దిల్ రాజుగారు చెప్పిన‌ట్లు డిఫ‌రెంట్‌గా ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ నా స్టైల్లో ఫ్యామిలీస్ అంద‌రూ చూసి వారి పాత జ్ఞాప‌కాల‌ను గుర్తుకు చేసుకునేలా కథ ఉంది. ఇప్ప‌టి యూత్‌కు న‌చ్చే క‌థ‌, అలాగే అంద‌రినీ న‌వ్వించే హార‌ర్‌కామెడీ ఉంది. ఈ సినిమాలో ప‌ని చేసిన నా ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్‌కి, మా చింతా గోపాల కృష్ణారెడ్డిగారికి థాంక్స్‌. డెఫనెట్‌గా సినిమా అంద‌రినీ అల‌రిస్తుంది” అన్నారు.