Site icon TeluguMirchi.com

వరుణ్ తేజ్ ఎంట్రీ లుక్ ఇదేనా?

varun tejమెగా ఫ్యామిలీ నుండి హీరో గా తెరంగ్రేటం చేయడానికి సిద్దంగా వున్నాడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి క్లీన్ హిట్ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిత్రంతో వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు వరుణ్. ఇందుకోసం కధా చర్చలు కూడా జరిగిపోయాయి.‘గొల్ల భామ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ చిత్రం కోసం వరుణ్ టోటల్ గెటప్ తో రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ లుక్ కు సంభందించి న ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో లో రఫ్ లుక్ తో ఆలరిస్తున్నాడు వరుణ్. తన తొలి సినిమా కోసమే ఇలా గడ్డం పెంచి ఉంటాడని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లో ఈ చిత్రం సంభందించిన షూటింగ్ ప్రారంభం కానుంది.

Exit mobile version