Site icon TeluguMirchi.com

వరుణ్ తేజ్ ‘మట్కా’ మోషన్ పోస్టర్ రిలీజ్ !!


ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్న వరుణ్ తేజ్, తన 14వ చిత్రాన్ని ‘పలాస’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్నారు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. తాజాగా నేడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమాలు జరిగాయి. అంతేకాదు ఈ సినిమాకి ‘మట్కా’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ పెట్టారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ కూడా వచ్చింది.

అదేంటంటే ‘మట్కా’ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. ఇకపోతే ‘మట్కా’ అనేది ఒకరకమైన జూదం. 1958-1982 మధ్య జరిగే ఈ కథ యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కబోతుంది. ఇందులో వరుణ్‌ తేజ్‌ ని నాలుగు డిఫరెంట్‌ గెటప్‌ లలో చూడబోతున్నాం. వరుణ్ తేజ్ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ చిత్రం కాబోతుంది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. నోరా ఫతేహి ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా.. నవీన్‌ చంద్ర, కన్నడ కిషోర్‌ ఇతర ముఖ్య తారాగణం. ఇక ఈ సినిమాకి జివి ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు.

Matka Motion Poster | Varun Tej | Karuna Kumar | Nora Fatehi | Meenakshi | GV Prakash | Vyra Ents

Exit mobile version