Site icon TeluguMirchi.com

‘గాండీవధారి అర్జున’ ట్రైలర్.. యాక్షన్ మోడ్ ఆన్ !


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.

‘డిసెంబ‌ర్ 2020లో దేవుడు మీద మ‌నిషి గెలిచాడంట‌.. జ‌స్ట్ పాతికవేల సంవ‌త్సరాల‌లో మ‌నిషి చేసిన వ‌స్తువులు దేవుడు చేసిన వాటిని మించేసాయంట. ఎలాగో తెలుసా..? అంటూ నాజర్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం యాక్షన్‌ సన్నివేశాలతో ఉత్కంఠభరితంగా సాగింది. ఇక ట్రైలర్ చూస్తుంటే ఈసారి వరుణ్ తేజ్ ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. విజువల్స్ కూడా బాగున్నాయి. ఇకపోతే మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో విమలారామన్‌, నాజర్‌, వినయ్‌ రాయ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Gandeevadhari Arjuna (Telugu) - Official Trailer | Varun Tej | Praveen Sattaru | Sakshi Vaidya |SVCC

Exit mobile version