Site icon TeluguMirchi.com

వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ టీజర్.. మరీ ఈ రేంజ్ లోనా ?


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా వున్నాడు. అందులో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ‘గాండీవధారి అర్జున’ ఒకటి. స్పై యాక్షన్ థ్రిల్లర్‏గా వస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇకపోతే ఇప్పటికే రిలీజైన పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక టీజర్ ఆసాంతం ఫుల్ యాక్షన్‌ ప్యాక్డ్ గా వుంది. ముఖ్యంగా చేజింగ్ సీన్స్, బ్లాస్టింగ్ ఎలిమెంట్స్, స్టంట్స్ హాలీవుడ్ రేంజ్ లో వున్నాయనే చెప్పచ్చు. ఇక మెగా హీరో వరుణ్ తేజ్ రా ఏజెంట్ గా అదరగొట్టేసాడు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మిక్కీ జే మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా వుంది. ఇకపోతే టీజర్ తోనే సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశారు. ఈ చిత్రంలో విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్ తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Gandeevadhari Arjuna - Official Teaser | Varun Tej | Praveen Sattaru | Sakshi Vaidya | SVCC

Exit mobile version