Site icon TeluguMirchi.com

వరుణ్ ముద్దు పేరు ఎదవ !


మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం . ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. తాజాగా సోహాల్ మీడియాలో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు వరుణ్‌ సరదగా సమాధానాలు ఇచ్చాడు.

తన ముద్దుపేర్లపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, “నాన్న ఎదవ అని పిలుస్తుంటాడు. అమ్మ వరుణ్ బాబూ అంటుంది. ఇంకా చాలానే ముద్దుపేర్లున్నాయి” అని చెప్పాడు. కొత్త సినిమా గురించి చెబుతూ.. ‘ఘాజీ’ తీసిన సంకల్ప్ రెడ్డితో సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఓ సినిమాలో నటిస్తున్నట్టు వెల్లడించాడు వరుణ్.

Exit mobile version