మెగా హీరో మొదలెట్టాడు..

varun-tejమెగా ఫ్యామిలీ కొత్త హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఓ షేడ్యూల్ ని పూర్తిచేసుకొంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. తాజాగా, డబ్బింగ్ ను మొదలెట్టారు. ఇప్పటివరకు చిత్రీకరించిన భాగానికి డబ్బింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు పేరుపెట్టని ఈ చిత్రానికి ‘ముకుందా మురారి’ అనే టైటిల్ పరిశీలనలో వున్నట్లు సమచారమ్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఫేం శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ ను లాంఛ్ చేస్తున్న విషయం తెలిసిందే. వరుణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్.