ఈ విషయంపై స్పందిస్తూ నా కోసం ఒకరు చేతిపై పర్మెనెంట్ టాటూ వేసుకున్నారు. అది జీవితాంతంఉంటుంది. దానితో పోలిస్తే పేడలో పడుకోవడం చిన్న విషయమే, అయినా టాస్క్ చేసింది నేను కదా తనకేంటి బాధ అంటూ వరుణ్ పున్నుపై సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత హిమజ కూడా మొదటి నుండి పునర్నవికి నేనంటే ఇష్టం లేదు అన్నా, అందుకే నువ్వు టాస్క్ చేసి నన్ను సేవ్ చేసినా కూడా విష్ చేయలేదంటూ చెప్పుకొచ్చింది. పున్నుకు చాలా విషయాల్లో వరుణ్ సపోర్ట్‌గా నిలిచాడు. కానీ పేడ టాస్క్ చేసినప్పటి నుండి అలా ఎందుకు యాటీట్యూడ్ చూపించదని ప్రేక్షకులు కూడా షాకయ్యారు.