బిగ్‌బాస్‌ : వరుణ్‌ వర్సెస్‌ పున్ను

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 పదవ వారానికి చేరుకుంది. పదవ వారం ఎలిమినేషన్‌ కు తాజాగా నామినేషన్‌ ప్రక్రియ జరిగింది. కాగా ఈ ప్రక్రియలో భాగంగా హిమజ సురక్షితురాలు కావాలంటూ వరుణ్‌ బిగ్‌బాస్‌ ఆదేశాల మేరకు పేడ తొట్టెలో పడుకోవాల్సి ఉంటుంది. చాలా కష్టంగా ఉన్నా కూడా వరుణ్‌ హిమజ కోసం ఆ టాస్క్‌ను పూర్తి చేశాడు. ఆ తర్వాత వరుణ్‌ ముందు పున్ను కాస్త యాటీట్యూడ్‌ చూపించిందని వరుణ్‌ సీరియస్‌ అయ్యాడు. హిమజను సేవ్‌ చేయడానికి వరుణ్‌ ఆ పేడ టాస్క్‌ చేయడం పునర్నవికి నచ్చలేదేమో కానీ టాస్క్‌ పూర్తి కాగానే వరుణ్‌తో సీరియస్‌గా ఉందట.

ఈ విషయంపై స్పందిస్తూ నా కోసం ఒకరు చేతిపై పర్మెనెంట్‌ టాటూ వేసుకున్నారు. అది జీవితాంతంఉంటుంది. దానితో పోలిస్తే పేడలో పడుకోవడం చిన్న విషయమే, అయినా టాస్క్‌ చేసింది నేను కదా తనకేంటి బాధ అంటూ వరుణ్‌ పున్నుపై సీరియస్‌ అయ్యాడు. ఆ తర్వాత హిమజ కూడా మొదటి నుండి పునర్నవికి నేనంటే ఇష్టం లేదు అన్నా, అందుకే నువ్వు టాస్క్‌ చేసి నన్ను సేవ్‌ చేసినా కూడా విష్‌ చేయలేదంటూ చెప్పుకొచ్చింది. పున్నుకు చాలా విషయాల్లో వరుణ్‌ సపోర్ట్‌గా నిలిచాడు. కానీ పేడ టాస్క్‌ చేసినప్పటి నుండి అలా ఎందుకు యాటీట్యూడ్‌ చూపించదని ప్రేక్షకులు కూడా షాకయ్యారు.