Site icon TeluguMirchi.com

వరుణ్ ఖాతాలో మరో ప్లాప్..?

varun

ముకుంద చిత్రం తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్..ఇప్పటివరకు మూడు సినిమాలు చేసినప్పటికీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు..కంచె చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం పెద్దగా ఆడలేకపోయింది. ఇక పూరి దర్శకత్వం లో చేసిన లోఫర్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.


ఆగడు, బ్రూస్ లీ వంటి డిజాస్టర్ సినిమాలు తెరకెక్కించిన శ్రీను వైట్ల ను నమ్ముకొని మిస్టర్ సినిమాలో నటించాడు…ప్రేమ కథ చిత్రంగా ఈ మూవీ ని శ్రీను వైట్ల తెరకెక్కించాడని ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అంత అనుకున్నారు. కానీ మొదటి ఆట తోనే మిస్టర్ పని అయిపోయిందని తేల్చేసారు. కథ లో దమ్ము లేకపోవడం..మూస పద్దతిలోనే శ్రీను మరోసారి తన దర్శకత్వ ప్రతిభను చూపించాడని టాక్ బయటకు వచ్చింది. ఈ దెబ్బ తో వరుణ్ ఖాతాలో మరో ప్లాప్ వచ్చినట్లే అని అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు..ఇక శ్రీను వైట్ల పని అయిపోయినట్లే అని అన్ని సర్దుకోవాల్సేదేనని తట్ట బుట్ట సర్దుకోవాల్సిందే అని కామెంట్స్ వేస్తున్నారు. ఇక వరుణ్ ఖాతాలో మిగిలి ఉంది ఫిదా చిత్రమే..దానితోయినా హిట్ కొడతాడా లేదో చూడాలి.

Exit mobile version