యంగ్ హీరో నాగ శౌర్య నుండి వస్తున్న సరికొత్త మూవీ కృష్ణ వ్రింద విహారి. అనీష్ ఆర్. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈరోజు సినిమాలోని మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ ను హీరోయిన్ సమంత విడుదల చేసింది. ‘బ్యూటిఫుల్ సాంగ్ విత్ బ్యూటిఫుల్ పీపుల్’ అంటూ ట్వీట్ చేస్తూ సామ్ ఈ పాటకు సంబంధించిన యూట్యూబ్ లింక్‌ని ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
‘రా .. వెన్నెల్లో వర్షంలా .., రా .. వర్షంలో వెన్నెల్లా .. అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌ని ఆదిత్య ఆర్కే, సంజన కాల్మంజే ఆలపించగా, మహతి స్వరసాగర్ అద్భుత సంగీతాన్ని అందించాడు. ఎంత రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని ట్యూన్ చేశారో అంతే రొమాంటిక్ గా పాటని చిత్రీకరీంచారనిపిస్తుంది.
ఈ మూవీ లో నాగశౌర్య బ్రాహ్మణ యువకుడిగా కనిపిస్తుండగా..సీనియర్ నటి రాధికా కీలక పాత్రలో నటిస్తుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీ లో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరుల నటిస్తుండగా మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందించారు.