సారీ చెప్పినా వ‌ద‌ల‌రా??

media
రాంగోపాల్ వ‌ర్మ ర‌గిలించిన వివాదం ఇంకా రేగుతూనే ఉంది. ఐస్ క్రీమ్ సినిమాపై వ‌చ్చిన స‌మీక్ష‌ల‌పై వ‌ర్మ మండిప‌డ్డాడు.
చీక‌ట్లో అరిచే కుక్క‌లూ అంటూ అస‌భ్య‌క‌ర‌మైన రీతిలో భారీ ప‌ద ప్ర‌యోగాలు చేశాడు. మాఫియాలా ప్ర‌వ‌ర్తిస్తుందంటూ… విమ‌ర్శించాడు. దాంతో మీడియా వ‌ర్మ‌ని టార్గెట్ చేసింది. ఇదివ‌ర‌కెప్పుడూ లేనంతగా కార్న‌ర్ చేసి… వ‌ర్మ‌ని ఓపెన్ డిబెట్‌లో అడ్డంగా క‌డిగేసింది.
దాంతో సారీ.. కూడా చెప్పాడు. అయితే… ఈ వివాదానికి పుల్‌స్టాప్ మాత్రం ప‌డ‌లేదు. వ‌ర్మ పై మీడియా ఇంకా గ‌ర‌మ్ గ‌ర‌మ్‌గానే ఉంది. ఇక మీద‌ట వ‌ర్మ ప్రెస్ మీట్ల‌ను, ఇంట‌ర్వ్యూల‌కు, వ‌ర్మ సినిమాల‌కు ప్ర‌చారాన్ని బ‌హిష్క‌రించాలని ఫిల్మ్ మీడియాలో ఓ గ్రూప్ బ‌లంగా భావిస్తోంది. బుధ‌వారం ఐస్ క్రీమ్ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ ఉంది. దాన్ని బ‌హిష్క‌రించి.. వ‌ర్మ‌కు తొలి హెచ్చ‌రిక‌లు పంపాల‌ని మీడియా బృందం భావిస్తొన్న‌ట్టు స‌మాచార‌మ్‌. ఇందుకు సంబంధించి మీడియాలోని ముఖ్య‌మైన‌వాళ్లంతా స‌మావేశ‌మై నిర్ణ‌యం తీసుకొంటార‌ని స‌మాచార‌మ్‌. నిజంగా మీడియా మొత్తం వ‌ర్మ‌ని బ‌హిష్క‌రిస్తే… వ‌ర్మ రియాక్ష‌న్ ఎలా ఉండ‌బోతోంది?? ప‌్ర‌చారానికీ, ప్రాణానికీ లింకు పెట్టుకొన్న వ‌ర్మ ఇక టాలీవుడ్‌లో సినిమాలు తీయ‌గ‌ల‌డా..?? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి మీడియా బృందం ఎలాంటి నిర్ణ‌యం తీసుకొంటుందో చూడాలి.