Site icon TeluguMirchi.com

బాలయ్య సినిమానే చూడండి అంటున్న డైరెక్టర్..

hordings-khaidi-gps

సంక్రాంతి బరిలో బాలకృష్ణ , చిరంజీవి తమ సినిమాలతో పోటీ పడుతున్న విషయం తెల్సిందే..మరో రెండురోజుల్లో ఈ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి..ఇప్పటికే ప్రచార కార్యక్రమాలతో భారీ అంచనాలు పెంచేశారు ఇరు చిత్ర వర్గాలు.. చిరంజీవి నటిస్తున్న ఖైదీ చిత్రం పక్క మాస్ & మెసేజ్ ఓరియంటెడ్ కథ తో రాబోతుండగా , తెలుగు చక్రవర్తి ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి తో బాలయ్య రాబోతున్నాడు..

Also Read :చిరంజీవి అంటే వర్మకి ఎందుకంత కసి

ఈ నేపథ్యం లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద ట్వీట్స్ చేసాడు. ఇప్పటికే తన ట్వీట్స్ తో మెగా అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్న వర్మ, సంక్రాంతికి విడుదల కానున్న శాతకర్ణి , ఖైదీ ల మధ్య పోలిక చెపుతూ మరింత చిచ్చుపెట్టాడు. బాలకృష్ణ నటించిన ‘గౌతమీ పుత్రశతకర్ణి’ తెలుగు చరిత్రకు సంబంధించిన సినిమా అని, చిరంజీవి నటించిన ఖైదీ-150 మాత్రం పక్క రాష్ట్రం వాళ్ల క్రియేటివిటీ అని వర్మ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్స్ చూస్తే ఇన్ డైరెక్ట్ గా మన తెలుగు వారు మన తెలుగు చిత్రాన్ని చూడండి అని చెప్పినట్లు ఉందని చాలామంది ఈ ట్వీట్స్ చూసి మండిపడుతున్నారు..ఓ డైరెక్టర్ అయి ఉండి, ఓ సినిమాని మాత్రమే చూడమని చెప్పడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు..

Exit mobile version