విష్ణుని వ‌ద్దన్న వ‌ర్మ‌!!!!

vrama vishnuరాంగోపాల్ వ‌ర్మ‌…… ప్రతి క‌థానాయ‌కుడూ, న‌టుడూ ఒక్కసారైనా ఆయ‌న‌తో క‌ల‌సి ప‌నిచేయాల‌నుకొంటాడు. మంచు విష్ణుకీ ఆ కోరిక ఉంద‌ట‌. అది నెర‌వేర్చుకొనేందుకు చాలా ప్రయ‌త్నాలు చేశాడు. కానీ వ‌ర్మ సారీ చెప్పేశాడు. ఓసారి కోన వెంక‌ట్ తో సిఫార్సు చేయించాడ‌ట‌. కానీ అది ఫ‌లించ‌లేదు. వ‌ర్మని బుట్టలో వేసుకోవ‌డానికి ”సార్ నాకు వంట చేయ‌డం వ‌చ్చు” అన్నాడ‌ట‌. ”నాకు వంట చేసే మ‌గాళ్లంటే అస‌హ్యం” అని ప‌బ్లిగ్గా చెప్పాడ‌ట వ‌ర్మ. దాంతో విష్ణు ప్లాన్ వ‌ర్కవుట్ కాలేదు. పూరి జ‌గ‌న్నాథ్‌తో అయినా సినిమా చేయాల‌ని రెండేళ్ల నుంచీ ఎదురుచూస్తున్నాడ‌ట విష్ణు. అయితే ఆయ‌నా నో చెప్పారు. ఇలా గురు శిష్యుల చేత కాద‌నిపించుకొన్నాడు విష్ణు. ఈ విష‌యాన్ని స‌త్య 2 ఆడియో వేడుక‌లో స్వయంగా విష్ణునే చెప్పుకొచ్చాడు.