Site icon TeluguMirchi.com

వర్మ తో కామెడి చేస్తాడా ?

vrama vishnuఫిల్మ్ నగర్ లో ఓ హాట్ న్యూస్ హాల్ చల్ చేస్తుంది. అదేంటంటే ..దర్శకుడు రాంగోపాల్ వర్మ , మంచు విష్ణు కాంబినేషన్ లో ఓ చిత్రం రానుందని. అవును… వీరిద్దరి కాంబినేషన్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇందుకు సంబంధించి వీరిద్దరి మధ్యా ఇటీవల చర్చలు జరిగినట్టూ, కలిసి పనిచేయడానికి వర్మ అంగీకరించినట్టూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. సత్య2 ఆడియో వేడుకలో ‘వర్మ తో పనిచేయడానికి నేను ఎప్పుడైనా సిద్దమే’ అని విష్ణు చెప్పడం ఈ ప్రాజెక్ట్ కు మరింత బలాన్ని ఇస్తుంది.

Exit mobile version