Site icon TeluguMirchi.com

బాలయ్య తో కల్కి..

నందమూరి బాలకృష్ణ తో ఓ ప్రయోగాత్మక చిత్రం చేస్తానంటున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..అ! సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన ఈయన…మొదటి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకోకపోయిన విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ఈయన రాజశేఖర్ తో కల్కి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న వర్మ..సినిమా విశేషాలతో పాటు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లను గురించి చెప్పుకొచ్చారు.


‘ఆదిత్య 369, భైరవద్వీపం’ లాంటి సినిమాల్లో బాలయ్య నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల తరహాలోనే బాలయ్య తో ఒక ప్రయోగాత్మక చిత్రం చేయాలని ఉందని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. తన వద్ద కొన్ని ఐడియాస్ ఉన్నాయని, వాటిలో ఒకదాన్ని ఎప్పటికైనా బాలయ్యతో ఎగ్జిక్యూట్ చేస్తానని ఆయన అంటున్నారు. మరి వర్మ కు బాలయ్య ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి.

Exit mobile version