Site icon TeluguMirchi.com

ప్రభాస్ ఫై వర్మ కామెంట్స్..ఏమానో తెలుసా..?

రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీ బాహుబలి..విజయవంతగా రన్ అవుతూ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది..సినిమా రిలీజ్ అయి 10 రోజులు కావొస్తున్నా ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు..రిలీజ్ కు ముందు సినిమా ఎలా ఉంటుందో అని చర్చలు జరిపిన వారంతా, ఇప్పుడు రికార్డ్స్ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు..

ఇక తాజాగా సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి బాహుబలి గురించి తన ట్విట్టర్లో చెప్పుకొచ్చాడు..ఈ మూవీ లో శివగామి పాత్రలో రమ్యకృష్ణ ఎంత అద్భుతంగా నటించిందో చెప్పనవసరం లేదు.. మొదట రాజమౌళి శివగామి పాత్రలో అతిలోక సుందరి శ్రీదేవిని ఎంపికచేసుకోవాలని అనుకున్నాడట. కానీ కొన్ని కారణాల వల్ల శ్రీదేవి ఈ పాత్రకు ఒప్పుకోలేదట.

అయితే అప్పుడు శివగామి పాత్రకు శ్రీదేవి ఒప్పుకుని ఉంటే క్రెడిట్‌ అంతా ప్రభాస్‌ కంటే ఆమెకే దక్కి ఉండేదని చెప్పుకొచ్చాడు రాంగోపాల్‌ వర్మ. ఒకవేళ శ్రీదేవి శివగామి పాత్రకు ఒప్పేసుకుని ఉంటే ఆమె కెరీర్‌లోనే బాహుబలి చిత్రం ఓ మైలురాయిగా నిలిచేదని వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

Exit mobile version