Tantra : మా సినిమాకు పిల్ల బచ్చాలు రావొద్దంటూ వార్నింగ్‌.. ఎందుకంటే ?


‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాల ఫేం అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘తంత్ర’. ఫిమేల్ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న ఈ హారర్‌ ఎంటర్‌టైనర్‌ ను ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. అనన్య నాగళ్లకి జోడీగా శ్రీహరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో ‘మర్యాదరామన్న’ ఫేమ్ సలోని ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ను షేర్ చేసింది చిత్రయూనిట్.

ఇక తమ సినిమాకి A సర్టిఫికేట్ రావడంపై ‘తంత్ర’ టీమ్ డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యింది. మా సినిమాకి పిల్ల బచ్చాలు రావద్దని హెచ్చరిస్తూ ‘A’ ని పెద్దగా హైలైట్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. నిజానికి ఇదొక సరికొత్త క్రియేటివ్ ప్రమోషనల్ స్ట్రాటజీ. అలానే తమ సినిమా మంచి హర్రర్ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్న మేకర్స్ తమ సినిమాకి చిన్నపిల్లలు రావద్దని వారిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన్ టీజర్, సాంగ్స్‌ని యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్ అనన్య నాగళ్ల పల్లెటూరి అమ్మాయిగా, క్షుద్రపూజలకి గురైన బాధితురాలిగా టీజర్‌లో కనపడితే.. ‘ధీరే ధీరే’ సాంగ్‌లో అందమైన ప్రియురాలిగా కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొడుతోంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ని త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.