Site icon TeluguMirchi.com

పోలీసు ఆఫీసర్ గా వర్మ.. దర్శకుడు పూరి

దర్శకుడు రాంగోపాల్‌వర్మకు పోలీస్ ఆఫీసర్‌ నటించాలని ఉందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. పోర్న్‌స్టార్‌ మియా మల్కొవా ప్రధాన పాత్రలో వర్మ తెరకెక్కించిన చిత్రం ‘గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌’. ఈ సినిమాపై మహిళా సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ మేరకు సామాజిక కార్యకర్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఈ రోజు వర్మ ను నాలుగు గంటల పాటు సీసీఎస్‌ పోలీసులు విచారించారు.

విచారణ అనంతరం బయటకు వచ్చిన వర్మ పలు ట్వీట్లు చేశారు. తాను చాలా ఆశ్యర్యకరమైన ఆనందంలో వున్నానని చెప్పారు. సీసీఎస్‌ టీమ్‌ ప్రొఫెషనలిజం తనను థ్రిల్‌కు గురిచేసిందన్నారు. తనకు పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో నటించాలని ఉందని, దర్శకులందరూ తన విన్నపాన్ని మన్నించాలని కోరారు. వర్మ చేసిన వరుస ట్వీట్లు చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్‌ ‘సర్‌! స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. మీ డేట్స్‌ కోసం వేచి చూస్తున్నా’అని సమాధానం ఇచ్చారు. ఇందుకు వర్మ ‘థాంక్యూ సర్‌!’అని రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా వుంది.

Exit mobile version