హవ్వా… పబ్లిసిటీ కోసం ఇంత చెత్త పని చేయాలా!

varalakhmiతమిళ స్టార్‌ హీరో కూతురుగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి తనదైన దూకుడుతో సినిమాలను చేస్తు మాటల తూటాలను పేల్చుతూ సోషల్‌ మీడియా ద్వారా తెగ పాపులర్‌ అవుతూ వస్తోంది. దేశంలో ఎక్కడ ఆడవారిపై దాడులు జరిగినా కూడా ఈ అమ్మడు చాలా సీరియస్‌ అవుతుంది. అంతేకాకుండా ఆడవారిని ఆటబొమ్మగా చూడొద్దు అంటూ పురుషులను తన కఠినమైన మాటలతో హెచ్చరిస్తూ తనదైన రీతిలో సోషల్‌ మీడియాలో చురుగ్గా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు కిడ్నాప్‌ అయ్యిందని, ఒక మంచంపై పడుకుని, నోటిలో గుడ్డను కుక్కి, రెండు చేతులను కట్టేసిన ఫొటోను వరలక్ష్మి అఫిషియల్‌ ఖాతా ద్వారా పోస్ట్‌ చేశారు. దాంతో ఈ అమ్మడి అభిమానులు కంగారు పడ్డారు. అసలే వరలక్ష్మికి కాస్త దూకుడెక్కువ అలాంటిది నిజంగా ఎవరైనా ఇలా కిడ్నాప్‌ చేశారా అనే సందేహాలు వచ్చాయి.

అభిమానులు ఈ అమ్మడికి ఏం జరిగింది, ఇప్పుడు ఎక్కడ ఉంది అని ఆరా తీయడం మొదలెట్టారు. దాంతో తాజాగా వరలక్ష్మి స్పందించి తాను బాగానే ఉన్నానని, తన గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసింది. అంతేకాకుండా ఆ ఫొటో తన తాజా చిత్రంలోని ఒక స్టిల్‌ అని, అది కేవలం పబ్లిసిటీ కోసం తానే చేశానని క్లారిటీ ఇచ్చింది. దాంతో వరలక్ష్మి చేసిన ఈ చెత్త పనికి అంతా కూడా విమర్శలు చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం ఇంత చెత్త పని చేయాలా అని వరలక్ష్మికి చివాట్లు పెడుతున్నారు. ఇలా పబ్లిసిటీ కోసం హీరోయిన్‌లు ఇలాంటి ఫొటోలు పెడితే ఒకానొక సమయంలో ఇలాంటివి నిజమైనా కూడా జనాలు ఖాతరు చేయను అంటూ సినీ వర్గాల వారు హెచ్చరిస్తున్నారు.