ప్రముఖ కొరియోగ్రాఫర్ తో నాలుగో పెళ్ళికి సిద్దమైన వనిత విజయకుమార్?


వనిత విజయకుమార్ ప్రముఖ నటుడు విజయకుమార్ కుమార్తె. తెలుగులో దేవి చిత్రంలో నటించిన ఈమె తరవాత వెండితెరమీద పెద్దగా కనపడలేదు. తమిళ, మలయాళంలో కూడా ఒకటి, రెండు చిత్రాల్లో మాత్రమే నటించింది. చేసిన సినిమాల కంటే ఎక్కువగా వ్యక్తిగత అంశాల వలన వార్తల్లో ఉండే వనిత విజయకుమార్ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన కొద్ది నెలల్లోనే ఆనంద్ జయరాజన్‌ను రెండో పెళ్లి చేసుకుంది. వనితకు రెండో భర్త ద్వారా జయనిత అనే కూతురు పుట్టింది. తర్వాత 2012లో ఆమె ఆనంద్ నుంచి విడాకులు కూడా తీసుకున్నారు. ఆ తరువాత వనితా విజయకుమార్ మళ్లీ వెండితెరపైకి వచ్చేందుకు బిగ్ బాస్ కార్యక్రమం తోడ్పడింది. అక్కడే ఏర్పడిన పరిచయం పీటర్ పాల్‌తో స్నేహం దాకా వెళ్లి ప్రేమ పుట్టి 2020లో వివాహంలో ముగిసింది. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఇంట్లో జరిగిన ఈ పెళ్లిని రిజిస్టర్ కూడా చేయలేదు. పీటర్ పాల్ మద్యానికి బానిస అంటూ కేవలం మూడు నెలల్లోనే వనితా విజయకుమార్ విడిపోయారు.

ఆ తరువాత, వనిత తన సినీ జీవితంపై దృష్టి సారించింది. ఇటీవలే ప్రశాంత్ నటించిన ‘అంధగన్’లో కూడా ఆమె నటనకు ప్రశంసలు అందాయి. వివాదాలకు పెట్టింది పేరైన వనితా విజయకుమార్ ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమైందా అనే సందేహం నెలకొంది. అదేంటంటే.. ‘ఎంజీఆర్ శివాజీ రజనీ కమల్’ సినిమాలో నటిస్తూ.. ఆమెతో ప్రేమ వార్తల్లో చిక్కుకున్న బిగ్ బాస్ సెలబ్రిటీ రాబర్ట్ మాస్టర్ కి ఆమె బీచ్ లో బికినీలో మోకరిల్లి ప్రపోజ్ చేసింది. దీనికి సంబంధించి అక్టోబర్ 5న కీలక సమాచారం వెలువడుతుందని అంటున్నారు. ఇది కేవలం సినిమా అప్డేట్ ఏనా? లేక నిజంగా నాలుగో పెళ్లా? అనేది ఆరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.