Site icon TeluguMirchi.com

వాల్మీకి కాదు ‘గద్దలకొండ గణేష్‌’ వస్తున్నాడు

దర్శకుడు హరీష్‌ శంకర్‌ తమిళచిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా ‘వాల్మీకి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌, పూజా హెగ్డేలు రొమాన్స్‌ చేశారు. శోభన్‌బాబు, సావిత్రిల సూపర్‌హిట్‌ సాంగ్‌ వెల్లువచ్చే గోదారమ్మా… పాటను ఈ చిత్రంలో రీమిక్స్‌ చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఇది సినిమాకు కచ్చితంగా ప్లస్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ ముందు నుండే ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ చిత్ర టైటిల్‌ ప్రకటన నుండి ‘వాల్మీకి’ వివాదాస్పదం అవుతూనే ఉంది. బోయ వంశస్థులు టైటిల్‌ను గురించి చాలా ఫైట్‌ చేశారు. టైటిల్‌ విషయమై కోర్టుదాకా వెళ్లవలసి వచ్చిన విషయం తెల్సిందే.

చివరి టైటిల్‌ను మార్చేదాకా ఆ గొడవ సద్దుమణుగలేదు. విడుదల ముందు చేసేది లేక టైటిల్‌ను మార్చారు. ఈ చిత్రంలో వరుణ్‌ క్యారెక్టర్‌ పేరుతో ‘గద్దలకొండ గణేష్‌’ టైటిల్‌ను ఫిక్స్‌ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే చివరి టైంలో కాబట్టి టైటిల్‌ మార్చినా కూడా దీనిని ‘వాల్మీకి’ అనే ప్రేక్షకులు అంటారు. ఇకపోతే ‘గద్దలకొండ గణేష్‌’ టైటిల్‌ కూడా ఆకట్టుకునేలా ఉంది. మొదటి నుండి ఇదే టైటిల్‌ ఉన్నా ఏ గొడవ లేకుండా ఉండును అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version