మెగా హీరో వరుణ్ తేజ్ కీలక పాత్రలో రూపొందుతున్న ‘వాల్మీకి’ని సెప్టెంబర్ 13న విడుదల చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఆ రోజున నాని గ్యాంగ్ లీడర్ విడుదలకు ఉన్నా కూడా అదే రోజున విడుదల చేయాలని దర్శకుడు పట్టు బట్టాడు. కాని దిల్‌రాజు మద్యవర్తిత్వంతో సినిమా వాయిదా వేశారు. వాల్మీకి చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు అంతా సిద్దం అయినట్లుగా డేటు విషయంలో తెగ హడావుడి చేసిన దర్శకుడు హరీష్ శంకర్ ఇంకా షూటింగ్‌ను పూర్తి చేయలేదట.
ప్రస్తుతం గోదావరిపై కొన్ని సీన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లుగా ఆయనే స్వయంగా పోస్ట్ చేశాడు. తనకు ఎప్పటి నుండో గోదావరిపై సీన్స్ షూట్ చేయాలనే కోరిక ఉంది. ఆ కోరిక ఈ చిత్రంతో తీరుతుందని ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే విడుదల తేదీ కోసం ఇంతగా హంగామా చేసిన హరీష్ శంకర్‌పై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. షూటింగ్ హడావుడిగా పూర్తి చేసి గ్యాంగ్‌లీడర్‌కు పోటీగా విడుదల చేయాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 20 వరకు అయినా సినిమాను పూర్తి చేస్తావా లేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.