Site icon TeluguMirchi.com

వరుణ్ బాబు కు కూడా తప్పలేదు..

ఈ మధ్య సినిమాలకు వరుస సెగలు తగులుతున్నాయి. కులస్థుడి పేరుతో టైటిల్ పెట్టిన..బయోపిక్ తీసిన సరే అందులో కథ ఏంటి..ఎలా ఉంటుంది అదేమీ చూడడం లేదు. షూటింగ్ టైంలోనే ఆయా కులస్థులు..కుటుంబ సభ్యులు నిరసనలు చెపుతూ షూటింగ్ కు అడ్డు తగులుతున్నారు. రీసెంట్ గా చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రానికి ఉయ్యాలా వాడ కుటుంబ సభ్యుల నిరసన సెగ తగులుగా..తాజాగా వరుణ్ తేజ్ నటిస్తున్న వాల్మీకి చిత్రానికి బోయ సామజిక వర్గం నుండి నిరసన సెగ ఎదురైంది.

హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కలయికలో వాల్మీకి చిత్రం తెరకెక్కుతుంది. రీసెంట్ గా ఈ చిత్ర షూటింగ్ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా బోయ సామజిక వర్గం వాళ్ళు ఈ చిత్ర షూటింగ్ కు ఆటంకం కలిగించారట. తమ వర్గాన్ని కించపరిచే విధంగా రౌడీగా పాత్ర చిత్రణ ఉందని వెంటనే మార్చాల్సిందిగా డిమాండ్ చేస్తూ వాగ్వాదానికి దిగడంతో దర్శకుడు హరీష్ శంకర్ ప్యాకప్ చెప్పేశారట
ఇప్పుడు దీన్ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేసి చేవెళ్ల ప్రాంతంలో తీసేందుకు ప్లానింగ్ చేస్తున్నట్లు సమాచారం.

Exit mobile version