తమిళ సూపర్ హిట్ ‘జిగార్తాండ’ కు రీమేక్ గా తెలుగులో వాల్మీకి చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా మెగా హీరో వరుణ్ తేజ్ ..తమిళ్ హీరో అధర్వ మురళి నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు చిత్ర ప్రీ-టీజర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ మేరకు రంజాన్ పండుగను పురష్కరించుకుని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన చేశారు.
‘ఈ పవిత్రమైన రోజున వాల్మీకి టీమ్ తరఫున ఈ ప్రకటన చేయడం ఆనందంగా ఉంది. ప్రీ-టీజర్‌తో అతి త్వరలో మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం’ అని హరీష్ శంకర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. మరి ఈ ప్రీ-టీజర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆయానకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Love to announce on this auspicious day from the team of Valmiki… that Very soon we gonna Surprise you guys with a
pre -teaser #PreTeaserValmiki….. @DoP_Bose @IAmVarunTej @Atharvaamurali @hegdepooja— Harish Shankar .S (@harish2you) 5 June 2019