Site icon TeluguMirchi.com

వాల్మీకి ప్రీ రిలీజ్ టీజ‌ర్ ముహూర్తం ఫిక్స్..

తొలిప్రేమ , ఎఫ్ 2 చిత్రాల హిట్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం వాల్మీకి. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా..పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. వరుణ్ తో పాటు తమిళ నటుడు అథర్వ మురళి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ప్రముఖ శివక్షేత్రమైన యాగంటిలో జరుపుకుంటుంది. దీనికి సంబందించిన లొకేషన్ పిక్స్ ను షేర్ చేసి విశేషాలను పంచుకున్నారు డైరెక్టర్ హరీష్. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ టీజ‌ర్ టైం ను ఫిక్స్ చేసాడు. జూన్ 24 సాయంత్రం 5:18ని.ల‌కి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు టీం పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి పోస్ట‌ర్స్ విడుద‌ల కాక‌పోయే స‌రికి ఈ ప్రీ రిలీజ్ టీజర్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.

14రీల్స్ బ్యానర్ పై ఆచంట రాము, గోపినాథ్ లు నిర్మిస్తున్న చిత్రానికి మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version