వరుణ్ తేజ్ ముఖ్య పాత్రలో హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్మీకి’. మరి కొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సమయంలో ఈ చిత్రంకు అయిన ఖర్చు ఎంత, వచ్చిన మొత్తం ఎంత అంటూ చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున ఈ విషయమై సినీ వర్గాల్లో జరుగుతున్న చర్చతో వాల్మీకి బడ్జెట్ మరియు బిజినెస్ వివరాలను మీకు అందిస్తున్నాం. పెట్టిన పెట్టుబడి విడుదలకు ముందు నిర్మాతలకు వచ్చి సేఫ్ అయినట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 30 కోట్లకు కాస్త అటు ఇటుగా వాల్మీకి బడ్జెట్ అయినట్లుగా తెలుస్తోంది. వరుణ్ తేజ్‌తో ఇంత బడ్జెట్ రిస్క్ అయినా దర్శకుడు హరీష్ శంకర్ ధైర్యంగా ఖర్చు చేయించాడు. సినిమాకు వచ్చిన క్రేజ్‌తో థియేట్రికల్ రైట్స్ ద్వారా 25 కోట్లు, ఇతర రైట్స్ ద్వారా మరో 10 కోట్ల వరకు దక్కినట్లుగా సమాచారం అందుతోంది. అంటే విడుదలకు ముందే నిర్మాతలకు 5 కోట్ల టేబుల్ ఫ్రాఫిట్. అందుకే ఈ చిత్రం సేఫ్ జోన్లో ఉంది. ఇక సినిమా విడుదలైన తర్వాత ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.