Site icon TeluguMirchi.com

మెగా ఫ్యామిలీ నుండి 11 హీరో రాబోతున్నాడు..

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి దాదాపు 10 మంది హీరోలు ఇండస్ట్రీ కి పరిచయం కాగా , తాజాగా మరో హీరో రాబోతున్నాడు. అతడే చిరంజీవి మేనల్లుడు , సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ వెండి తెరకు పరిచయం కాబోతున్నాడు. నటుడు & డైరెక్టర్ అయినా శ్రీనివాస్ అవసరాల ఇతడిని డైరెక్ట్ చేయబోతున్నారనే వార్త ఫిలిం సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రాబోతుందని అంటున్నారు.

entry
ఈ మధ్యనే చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తన మొదటి సినిమాను మొదలు పెట్టిన సంగతి తెల్సిందే.. సాయి కొర్రపాటి ఈ చిత్రానికి నిర్మాత. మొత్తానికి క్రికెట్ టీం మాదిరి మెగా ఫ్యామిలీ నుండి హీరోలు వస్తుండడం తో మెగా అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ , అల్లు అర్జున్ ఫుల్ రేసు లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే వరుణ్ తేజ్ దారిలోకి వస్తున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ మాత్రం వరుస ప్లాప్స్ తో వెనుకంజ లో ఉన్నాడు. ఇక అల్లు శిరీష్ మాత్రం హీరోగా రాణించడం కోసం కష్టపడుతున్నాడు.

Exit mobile version