Site icon TeluguMirchi.com

CCC ఛారిటీకి యూవీ విరాళం..

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ మూతపడింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది.

ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్ధిక సాయాన్ని అందజేస్తుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటి ద్వారా సినీ కార్మికులను ఆదుకునే పని చేస్తున్నారు.

ఇప్పటికే ఈ ఛారిటీకి చిరంజీవి కోటి రూపాయలు, నాగార్జున కోటి రూపాయలు, రామ్ చరణ్ రూ.30 లక్షలు, ఎన్టీఆర్ రూ.25 లక్షలు, నాగచైతన్య రూ.25 లక్షలు, వరుణ్ తేజ్ రూ.20 లక్షలు, రవితేజ రూ.20 లక్షలు, శర్వానంద్ రూ. 15 లక్షలు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రూ.10 లక్షలు, విశ్వక్‌సేన్ రూ.5 లక్షలు, కార్తికేయ రూ.2 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు, బ్రహ్మాజీ రూ.75వేలు, ఆయన తనయుడు సంజయ్ రావు రూ.25 వేలు, వెన్నెల కిషోర్ ,సంపూర్ణేష్ బాబు త‌దిత‌రులు త‌మకి తోచినంత విరాళాలు అందజేయగా..తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ రూ.10 ల‌క్షల విరాళాన్ని అందించ‌నున్న‌ట్టు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించింది. మిర్చి సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ భ‌లే భ‌లే మ‌గాడివోయ్, మ‌హానుభావుడు, భాగ‌మ‌తి, ట్యాక్సీవాలా, సాహో వంటి చిత్రాల‌ని నిర్మించింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 20వ చిత్రాన్ని త‌మ బ్యాన‌ర్‌లోనే నిర్మిస్తుంది.

Exit mobile version