ఉప్పెన ‘విజయ్ సేతుపతి’ లుక్ కేక ..

వైష్ణవ్ తేజ్ – బుచ్చిబాబు సాన కలయికలో వస్తున్న చిత్రం ఉప్పెన. ఇప్పటికే హీరో తాలూకా ఫస్ట్ లుక్ విడుదల చేసి ఆకట్టుకోగా..తాజాగా ఈ మూవీ లో విలన్ రోల్ చేస్తున్న కోలీవుడ్‌ స్టార్ హీరో విజయ్ సేతుపతి తాలూకా ఫస్ట్ లుక్ విడుదల చేసి అంచనాలు పెంచారు.

ఈ మూవీ లో విజయ్ ‘రాయనమ్’ అనే పాత్ర లో కనిపిస్తున్నాడు. ఈ లుక్ లో విజయ్ బ్లాక్ అంబాసిడర్ కారు పక్కనుండగా..మరో లుక్ లో సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ టీం, సుకుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ సంగీతం.. క్రితి శెట్టి హీరోయిన్. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2 న ఈ మూవీ రాబోతుంది.