ఉపేంద్ర కు లేడి బాస్ వేధింపులు!

shrimathiవిలక్షణ హీరో ఉపేంద్ర, సెలీనాజైట్లీ, ప్రియాంక త్రివేది నటీనటులుగా రవి దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం శ్రీమతి’. ఈ చిత్రాన్ని ‘ఎక్స్‌వైజడ్‌’ టైటిల్‌తో తెలుగులోకి అనువదిస్తున్నారు. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్, కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా కాంబినేషన్‌లో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘ఐత్‌రాజ్’కు ఇది రీమేక్. ఘంటాడి కృష్ణ సంగీతం అందిచిన ఆడియో సీడీల్ని శనివారం ఆవిష్కరించారు. “తన లేడీ బాస్ పెట్టే లైంగిక వేధింపుల నుంచి తన భార్య సహకారంతో ఓ ఉద్యోగి ఎలా బయటపడ్డాడనే అంశాన్ని వినోదాత్మకంగా చెప్పిన సినిమా ఇది. ఉద్యోగిగా ఉపేంద్ర, లేడీ బాస్‌గా సెలీనా జైట్లీ, భార్యగా ప్రియాంక తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని యూనిట్ చెబుతోంది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిథులుగా దర్శకుల సంఘం అధ్యక్షుడు సాగర్, దర్శకుడు పి. సునీల్‌కుమార్‌రెడ్డి, నిర్మాత సురేశ్ కొండేటి హాజరయ్యారు.