బ‌న్నీ సినిమాలో ఉపేంద్ర‌?

allu-arjun-upendra
చిత్ర విచిత్ర‌మైన క‌థ‌ల‌తో, వెండి తెర‌పై విన్యాసాలు సృష్టిస్తుంటారు క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర‌. తెలుగులోనూ ఆయ‌న‌కు అభిమానులున్నారు. ఇప్పుడాయ‌న అల్లు అర్జున్‌తో క‌ల‌సి న‌టిస్తున్నారా?? ఔన‌నే అంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. బ‌న్నీ – త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇందులో ఓ కీల‌క‌మైన పాత్ర కోసం ఉపేంద్ర‌ని సంప్ర‌దించార‌ని తెలుస్తోంది. అంత‌కు ముందు ఈ పాత్ర కోసం అర్జున్ పేరు ప‌రిశీలించారు. ఇప్పుడు ఉపేంద్ర రేసులోకి వ‌చ్చాడు. స‌మంత‌, ప్ర‌ణీత‌లు క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది.